కురాన్ - 44:3 సూరా సూరా దుఖాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِنَّآ أَنزَلۡنَٰهُ فِي لَيۡلَةٖ مُّبَٰرَكَةٍۚ إِنَّا كُنَّا مُنذِرِينَ

నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) శుభప్రదమైన రాత్రిలో అవతరింపజేశాము.[1] నిశ్చయంగా, మేము (ప్రజలను) ఎల్లప్పుడూ హెచ్చరిస్తూ వచ్చాము. [2]

సూరా సూరా దుఖాన్ ఆయత 3 తఫ్సీర్


[1] ఖుర్ఆన్ అవతరింపజేయబడిన రాత్రి లైలతుల్ ఖద్ర్ శుభవంతమైన రాత్రి. చూడండి, సూరహ్ అల్-ఖద్ర్ (97) . ఇంకా చూడండి 2:185 ఈ రాత్రి రమ'దాన్ నెల చివరి 10 రోజులలోని బేసి రాత్రులలో ఒకటి అని చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయం. 1) ఈ రాత్రిలో ఖుర్ఆన్ అవతరింపజేయబడింది. 2) ఈ రాత్రిలోనే దైవదూత (అలైహిమ్ స.)లు మరియు పవిత్ర ఆత్మ (జిబ్రీల్ 'అ.స.) దిగి వస్తారు. 3) ఈ రాత్రిలో, రాబోయే సంవత్సరంలో జరగబోయే విషయాల నిర్ణయం జరుగుతుంది. 4) ఈ రాత్రిలో చేసే ఆరాధన ('ఇబాదహ్) వేయి నెలల (83 సంవత్సరాల 4 నెలల) ఆరాధన కంటే ఉత్తమమైనది. ఈ రాత్రిలోనే ఖుర్ఆన్ ఏడవ ఆకాశంపై ఉన్న లౌ'హె మ'హ్ ఫూ"జ్ నుండి భూలోకపు ఆకాశంపై ఉన్న బైతుల్ 'ఇజ్జహ్ లోకి మొత్తం ఒకేసారి దింపబడింది. ఆ తరువాత 23 సంవత్సరాలలో క్రమక్రమంగా దైవప్రవక్త ('స'అస) మీద అవతరింపజేయబడింది. [2] ఖుర్ఆన్ అవతరణ ప్రజలకు మంచి చెడును బోధించటానికి జరిగింది.

సూరా దుఖాన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now