కురాన్ - 33:33 సూరా సూరా అహ్‌జాబ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَقَرۡنَ فِي بُيُوتِكُنَّ وَلَا تَبَرَّجۡنَ تَبَرُّجَ ٱلۡجَٰهِلِيَّةِ ٱلۡأُولَىٰۖ وَأَقِمۡنَ ٱلصَّلَوٰةَ وَءَاتِينَ ٱلزَّكَوٰةَ وَأَطِعۡنَ ٱللَّهَ وَرَسُولَهُۥٓۚ إِنَّمَا يُرِيدُ ٱللَّهُ لِيُذۡهِبَ عَنكُمُ ٱلرِّجۡسَ أَهۡلَ ٱلۡبَيۡتِ وَيُطَهِّرَكُمۡ تَطۡهِيرٗا

మరియు మీరు మీ ఇండ్లలోనే ఉండిండి మరియు పూర్వపు అజ్ఞానకాలంలో అలంకరణను ప్రదర్శిస్తూ తిరిగినట్లు తిరగకండి.[1] మరియు నమాజ్ స్థాపించండి మరియు విధిదానం (జకాత్) ఇవ్వండి మరియు అల్లాహ్ కు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి. (ఓ ప్రవక్త) గృహిణులారా![2] నిశ్చయంగా, అల్లాహ్ మీ నుండి మాలిన్యాన్ని తొలగించి, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయగోరు తున్నాడు.

సూరా సూరా అహ్‌జాబ్ ఆయత 33 తఫ్సీర్


[1] చూడండి, 5:50. [2] అహ్లల్ - బైత్, శబ్దానికి ఈ విధంగా అర్థాలు ఇవ్వబడ్డాయి. ఈ ఆయత్ లో ఖుర్ఆన్, దైవప్రవక్త ('స'అస) సతీమణు (ర'ది.'అన్హుమ్)లనే సంబోధిస్తోంది. ఖుర్ఆన్ లో ఇతర చోట్లలో కూడా భార్యలను అహ్లల్-బైత్ అని, సంబోధించబడింది. ఉదాహరణకు 11:73. కొందరు 'అలీ, ఫాతిమా, 'హసన్ మరియు 'హుసైన్ (ర'ది.'అన్హుమ్)లను మాత్రమే అహ్లల్-బైత్ గా భావిస్తున్నారు. వాస్తవమేమిటంటే, దైవప్రవక్త సతీమణులూ (ర'ది.'అన్హుమ్), దైవప్రవక్త ('స'అస) సంతానం (ర'ది'అన్హుమ్) మరియు ఈ నలుగురూ (ర'ది'అన్హుమ్), అందరూ అహ్లల్-బైత్ వారే! (ఫ'త్హ్ అల్-ఖదీర్, షౌకానీ)

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now