కురాన్ - 7:57 సూరా సూరా అరాఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَهُوَ ٱلَّذِي يُرۡسِلُ ٱلرِّيَٰحَ بُشۡرَۢا بَيۡنَ يَدَيۡ رَحۡمَتِهِۦۖ حَتَّىٰٓ إِذَآ أَقَلَّتۡ سَحَابٗا ثِقَالٗا سُقۡنَٰهُ لِبَلَدٖ مَّيِّتٖ فَأَنزَلۡنَا بِهِ ٱلۡمَآءَ فَأَخۡرَجۡنَا بِهِۦ مِن كُلِّ ٱلثَّمَرَٰتِۚ كَذَٰلِكَ نُخۡرِجُ ٱلۡمَوۡتَىٰ لَعَلَّكُمۡ تَذَكَّرُونَ

మరియు ఆయనే తన కారుణ్యానికి ముందు శుభవార్తలు తెచ్చే వాయువులను పంపేవాడు. ఎప్పుడైతే అవి బరువైన మేఘాలను ఎత్తుకొని వస్తాయో మేము వాటిని నిర్జీవమైన నగరాల వైపునకు తీసుకొని పోయి వాటి నుండి నీటిని కురిపిస్తాము. ఆ నీటి వలన పలు విధాలైన ఫలాలను ఉత్పత్తి చేస్తాము. ఇదే విధంగా మేము మృతులను కూడా లేపుతాము; ఈ విధంగానైనా మీరు హితబోధ స్వీకరిస్తారని![1]

సూరా సూరా అరాఫ్ ఆయత 57 తఫ్సీర్


[1] ఏ విధంగానైతే అల్లాహుతా'ఆలా వర్షం కురిపించి మృత భూమి నుండి పంట, ఫలాలను ఉత్పత్తి చేస్తాడో! అదే విధంగా, పునరుత్థాన దినమున మృతులను కూడా సజీవులుగా చేసి లేపుతాడు. అల్లాహుతా'ఆలా ప్రతిదీ చేయగల సమర్థుడు.

Sign up for Newsletter