కురాన్ - 23:100 సూరా సూరా ముఅ్మినూన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

لَعَلِّيٓ أَعۡمَلُ صَٰلِحٗا فِيمَا تَرَكۡتُۚ كَلَّآۚ إِنَّهَا كَلِمَةٌ هُوَ قَآئِلُهَاۖ وَمِن وَرَآئِهِم بَرۡزَخٌ إِلَىٰ يَوۡمِ يُبۡعَثُونَ

నేను చేయకుండా వచ్చిన సత్కార్యాలు చేయటానికి."[1] అది కాని పని. నిశ్చయంగా అది అతని నోటిమాట మాత్రమే![2] ఇక (ఈ మరణించిన) వారు తిరిగి లేపబడే దినం వరకు వారి ముందు ఒక అడ్డుతెర (బర్ జఖ్) ఉంటుంది.[3]

సూరా సూరా ముఅ్మినూన్ ఆయత 100 తఫ్సీర్


[1] ఈ దు'ఆ ప్రతి సత్యతిరస్కారి: 1) మరణం ఆసన్నమైనప్పుడు, 2) పునరుత్థానదినమున, అల్లాహ్ (సు.తా.) సమక్షంలో హాజరు చేయబడినప్పుడు మరియు 3) నరకంలోకి త్రోయబడి నప్పుడు చేస్తాడు. కాని సఫలుడు కాడు. ఈ వాక్యం ఖుర్ఆన్ లో అనేక సార్లు వచ్చింది. చూడండి, 63:10-11, 14:44, 7:53, 32:12, 6:27-28, 40:11-12, 35:37 మొదలైనవి. [2] అది కాని పని, చూడండి, 6:28 [3] ఇహలోక మరియు పరలోక జీవితపు మధ్య కాలాన్ని బర్'జ'ఖ్ అంటారు.

సూరా ముఅ్మినూన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now