సూరహ్ అల్-మైదా - తెలుగు అనువాదం, లిప్యంతరణ, తఫ్సీర్ - నుండి [90-100] వరకు

Read More
Read Less
 

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

 

إِنَّمَا يُرِيدُ ٱلشَّيۡطَٰنُ أَن يُوقِعَ بَيۡنَكُمُ ٱلۡعَدَٰوَةَ وَٱلۡبَغۡضَآءَ فِي ٱلۡخَمۡرِ وَٱلۡمَيۡسِرِ وَيَصُدَّكُمۡ عَن ذِكۡرِ ٱللَّهِ وَعَنِ ٱلصَّلَوٰةِۖ فَهَلۡ أَنتُم مُّنتَهُونَ

నిశ్చయంగా, షైతాన్ మధ్యపానం మరియు జూదం ద్వారా మీ మధ్య విరోధాలు మరియు విద్వేషాలు రేకెత్తించాలని మరియు మిమ్మల్ని అల్లాహ్ ధ్యానం నుండి మరియు నమాజ్ నుండి తొలగించాలని కోరుతున్నాడు. అయితే మీరిప్పుడైనా మానుకోరా?

وَأَطِيعُواْ ٱللَّهَ وَأَطِيعُواْ ٱلرَّسُولَ وَٱحۡذَرُواْۚ فَإِن تَوَلَّيۡتُمۡ فَٱعۡلَمُوٓاْ أَنَّمَا عَلَىٰ رَسُولِنَا ٱلۡبَلَٰغُ ٱلۡمُبِينُ

మరియు మీరు అల్లాహ్ కు విధేయులై ఉండండి మరియు ప్రవక్తను అనుసరించండి. జాగ్రత్త! మీరు ఒకవేళ తిరిగిపోతే! నిశ్చయంగా, మా ప్రవక్త బాధ్యత కేవలం (మా ఆజ్ఞను) మీకు స్పష్టంగా అందజేయటం మాత్రమే అని తెలుసుకోండి.

لَيۡسَ عَلَى ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّـٰلِحَٰتِ جُنَاحٞ فِيمَا طَعِمُوٓاْ إِذَا مَا ٱتَّقَواْ وَّءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّـٰلِحَٰتِ ثُمَّ ٱتَّقَواْ وَّءَامَنُواْ ثُمَّ ٱتَّقَواْ وَّأَحۡسَنُواْۚ وَٱللَّهُ يُحِبُّ ٱلۡمُحۡسِنِينَ

విశ్వసించి సత్కార్యాలు చేసే వారిపై, (ఇంతకు ముందు) వారు తిన్న (త్రాగిన) దాన్ని గురించి దోషం లేదు; ఒకవేళ వారు దైవభీతి కలిగి ఉండి, విశ్వసించి, సత్కార్యాలు చేస్తూ ఉంటే, ఇంకా దైవభీతి కలిగి ఉండి విశ్వాసులైతే, ఇంకా దైవభీతి కలిగి ఉండి సజ్జనులైతే! మరియు అల్లాహ్ సజ్జనులను ప్రేమిస్తాడు.

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَيَبۡلُوَنَّكُمُ ٱللَّهُ بِشَيۡءٖ مِّنَ ٱلصَّيۡدِ تَنَالُهُۥٓ أَيۡدِيكُمۡ وَرِمَاحُكُمۡ لِيَعۡلَمَ ٱللَّهُ مَن يَخَافُهُۥ بِٱلۡغَيۡبِۚ فَمَنِ ٱعۡتَدَىٰ بَعۡدَ ذَٰلِكَ فَلَهُۥ عَذَابٌ أَلِيمٞ

ఓ విశ్వాసులారా! (మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు) - మీ ఇంద్రియాలకు అగోచరమైన అల్లాహ్ కు ఎవరు భయపడాతో చూడటానికి - అల్లాహ్ మీ చేతులకు మరియు మీ బల్లెములకు అందుబాటులో ఉన్న కొన్ని వేట (జంతువుల) ద్వారా మిమ్మల్ని పరీక్షకు గురి చేస్తాడు. కావున ఈ (హెచ్చరిక) తరువాత కూడా ఎవడు హద్దును అతిక్రమిస్తాడో, వాడికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَقۡتُلُواْ ٱلصَّيۡدَ وَأَنتُمۡ حُرُمٞۚ وَمَن قَتَلَهُۥ مِنكُم مُّتَعَمِّدٗا فَجَزَآءٞ مِّثۡلُ مَا قَتَلَ مِنَ ٱلنَّعَمِ يَحۡكُمُ بِهِۦ ذَوَا عَدۡلٖ مِّنكُمۡ هَدۡيَۢا بَٰلِغَ ٱلۡكَعۡبَةِ أَوۡ كَفَّـٰرَةٞ طَعَامُ مَسَٰكِينَ أَوۡ عَدۡلُ ذَٰلِكَ صِيَامٗا لِّيَذُوقَ وَبَالَ أَمۡرِهِۦۗ عَفَا ٱللَّهُ عَمَّا سَلَفَۚ وَمَنۡ عَادَ فَيَنتَقِمُ ٱللَّهُ مِنۡهُۚ وَٱللَّهُ عَزِيزٞ ذُو ٱنتِقَامٍ

ఓ విశ్వాసులారా! మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు వేటాడకండి.[1] మీలో ఎవరైనా బుద్ధిపూర్వకంగా వేట చేస్తే, అతడు చంపిన జంతువుతో సరితూగే ఒక పశువును పరిహారంగా సమర్పించుకోవాలి. దానిని (ఆ పశువును) మీలో న్యాయవర్తులైన ఇద్దరు వ్యక్తులు నిర్ణయించాలి. పశువును ఖుర్బానీ కొరకు కఅబహ్ వద్దకు చేర్చాలి. లేదా దానికి పరిహారంగా కొందరు పేదలకు భోజనం పెట్టాలి, లేదా దానికి పరిహారంగా - తాను చేసిన దాని ప్రతిఫలాన్ని చవిచూడటానికి - ఉపవాసముండాలి. గడిచిపోయిన దానిని అల్లాహ్ మన్నించాడు. కాని ఇక ముందు ఎవరైనా మళ్ళీ అలా చేస్తే అల్లాహ్ అతనికి ప్రతీకారం చేస్తాడు. మరియు అల్లాహ్ సర్వ శక్తి సంపన్నుడు, ప్రతీకారం చేయగలవాడు.

أُحِلَّ لَكُمۡ صَيۡدُ ٱلۡبَحۡرِ وَطَعَامُهُۥ مَتَٰعٗا لَّكُمۡ وَلِلسَّيَّارَةِۖ وَحُرِّمَ عَلَيۡكُمۡ صَيۡدُ ٱلۡبَرِّ مَا دُمۡتُمۡ حُرُمٗاۗ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِيٓ إِلَيۡهِ تُحۡشَرُونَ

సముద్ర జంతువులను వేటాడటం మరియు వాటిని తినటం,[1] జీవనోపాధిగా మీకూ (స్థిరనివాసులకూ) మరియు ప్రయాణీకులకూ ధర్మసమ్మతం చేయబడింది. కానీ, మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నంత వరకూ భూమిపై వేటాడటం మీకు నిషేధింపబడింది. కావున మీరు (పునరుత్థాన దినమున) ఎవరి ముందు అయితే సమావేశ పరచ బడతారో ఆ అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి.

۞جَعَلَ ٱللَّهُ ٱلۡكَعۡبَةَ ٱلۡبَيۡتَ ٱلۡحَرَامَ قِيَٰمٗا لِّلنَّاسِ وَٱلشَّهۡرَ ٱلۡحَرَامَ وَٱلۡهَدۡيَ وَٱلۡقَلَـٰٓئِدَۚ ذَٰلِكَ لِتَعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ يَعۡلَمُ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِ وَأَنَّ ٱللَّهَ بِكُلِّ شَيۡءٍ عَلِيمٌ

అల్లాహ్ పవిత్ర గృహం అయిన కఅబహ్ ను మానవజాతి కొరకు, సురక్షితమైన శాంతి నిలయంగా (బైతుల్ హరామ్ గా) చేశాడు.[1] మరియు పవిత్ర మాసాన్ని మరియు బలి (హద్ య) పశువులను మరియు మెడలలో పట్టాలు వేసి కఅబహ్ కు ఖుర్బానీ కొరకు తేబడే పశువులను (ఖలా ఇదలను) కూడా నియమించాడు. ఇది ఆకాశాలలోను మరుయ భూమిలోను ఉన్నదంతా నిశ్చయంగా, అల్లాహ్ ఎరుగునని, మీరు తెలుసుకోవాలని! మరియు నిశ్చయంగా అల్లాహ్ కు ప్రతి ఒక్క విషయం గురించి బాగా తెలుసు.

ٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ شَدِيدُ ٱلۡعِقَابِ وَأَنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٞ

నిశ్చయంగా, అల్లాహ్ శిక్ష విధించటంలో కఠినుడని తెలుసుకోండి మరియు నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

مَّا عَلَى ٱلرَّسُولِ إِلَّا ٱلۡبَلَٰغُۗ وَٱللَّهُ يَعۡلَمُ مَا تُبۡدُونَ وَمَا تَكۡتُمُونَ

సందేశహరుని బాధ్యత కేవలం (అల్లాహ్ సందేశాలను) మీకు అందజేయటమే! మరియు మీరు వెలి బుచ్చేది మరియు దాచేది అంతా అల్లాహ్ కు బాగా తెలుసు.

قُل لَّا يَسۡتَوِي ٱلۡخَبِيثُ وَٱلطَّيِّبُ وَلَوۡ أَعۡجَبَكَ كَثۡرَةُ ٱلۡخَبِيثِۚ فَٱتَّقُواْ ٱللَّهَ يَـٰٓأُوْلِي ٱلۡأَلۡبَٰبِ لَعَلَّكُمۡ تُفۡلِحُونَ

(ఓ ప్రవక్తా!) ఇలా అను: "చెడు వస్తువుల ఆధిక్యత నీకు ఎంత నచ్చినా! చెడు మరియు మంచి వస్తువులు సరిసమానం కాజాలవు.[1] కావున ఓ బుద్ధిమంతులారా! మీరు సాఫల్యం పొందాలంటే అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి."

Surah telugu Translation and Transliteration

In Surah you can read the translation of Ahmad Raza Khan who was a renowned scholar of the Islamic world and his translation book is known as Kanzul Imaan. You can read the transliteration of Surah which will help you to understand how to read the Arabic text. Apart from that, we have included a Word-By-Word telugu Translation of the Arabic text of Surah .

Surah telugu Tafsir/Tafseer (Commentry)

In Surah we have included two Tafseer (Commentary) in telugu. The first one is from Mufti Ahmad Yaar Khan who was a well-known scholar. In this tafsir, we have also included the most popular Tafsir Ibn-Kathir which is the most comprehensive tafsir available in the world. You can read both or any one of your choice.

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now