بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
۞يَـٰٓأَيُّهَا ٱلرَّسُولُ لَا يَحۡزُنكَ ٱلَّذِينَ يُسَٰرِعُونَ فِي ٱلۡكُفۡرِ مِنَ ٱلَّذِينَ قَالُوٓاْ ءَامَنَّا بِأَفۡوَٰهِهِمۡ وَلَمۡ تُؤۡمِن قُلُوبُهُمۡۛ وَمِنَ ٱلَّذِينَ هَادُواْۛ سَمَّـٰعُونَ لِلۡكَذِبِ سَمَّـٰعُونَ لِقَوۡمٍ ءَاخَرِينَ لَمۡ يَأۡتُوكَۖ يُحَرِّفُونَ ٱلۡكَلِمَ مِنۢ بَعۡدِ مَوَاضِعِهِۦۖ يَقُولُونَ إِنۡ أُوتِيتُمۡ هَٰذَا فَخُذُوهُ وَإِن لَّمۡ تُؤۡتَوۡهُ فَٱحۡذَرُواْۚ وَمَن يُرِدِ ٱللَّهُ فِتۡنَتَهُۥ فَلَن تَمۡلِكَ لَهُۥ مِنَ ٱللَّهِ شَيۡـًٔاۚ أُوْلَـٰٓئِكَ ٱلَّذِينَ لَمۡ يُرِدِ ٱللَّهُ أَن يُطَهِّرَ قُلُوبَهُمۡۚ لَهُمۡ فِي ٱلدُّنۡيَا خِزۡيٞۖ وَلَهُمۡ فِي ٱلۡأٓخِرَةِ عَذَابٌ عَظِيمٞ
ఓ ప్రవక్తా! సత్యతిరస్కారంలోకి పరుగులు తీసే వారి వల్ల నీవు దుఃఖపడకు. అలాంటి వారు: "మేము విశ్వసించాము." అని తమ నోటితో మాత్రమే అంటారు. కాని వారి హృదయాలు విశ్వసించలేదు. మరియు యూదులలో కొందరు అసత్యాలను కుతూహలంతో వినే వారున్నారు మరియు నీ వద్దకు ఎన్నడూ రాని ఇతర ప్రజలకు (అందజేయటానికి) మీ మాటలు వినే వారున్నారు. వారు పదాల అర్థాలను మార్చి, వాటి సందర్భాలకు భిన్నంగా తీసుకుని ఇలా అంటారు: "మీకు ఈ విధమైన (సందేశం) ఇస్తేనే స్వీకరించండి మరియు ఇలాంటిది ఇవ్వక పోతే, జాగ్రత్త పడండి!" మరియు అల్లాహ్ ఎవరిని పరీక్షించ దలచాడో (తప్పు దారిలో వదల దలచాడో) వారిని అల్లాహ్ నుండి తప్పించటానికి నీవు ఏమీ చేయలేవు. ఎవరి హృదయాలను అల్లాహ్ పరిశుద్ధ పరచ గోరలేదో అలాంటి వారు వీరే. వారికి ఇహలోకంలో అవమానం ఉంటుంది. మరియు వారికి పరలోకంలో ఘోర శిక్ష ఉంటుంది.
سَمَّـٰعُونَ لِلۡكَذِبِ أَكَّـٰلُونَ لِلسُّحۡتِۚ فَإِن جَآءُوكَ فَٱحۡكُم بَيۡنَهُمۡ أَوۡ أَعۡرِضۡ عَنۡهُمۡۖ وَإِن تُعۡرِضۡ عَنۡهُمۡ فَلَن يَضُرُّوكَ شَيۡـٔٗاۖ وَإِنۡ حَكَمۡتَ فَٱحۡكُم بَيۡنَهُم بِٱلۡقِسۡطِۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلۡمُقۡسِطِينَ
వారు అబద్ధాన్ని వినేవారు మరియు నిషిద్ధమైన దానిని తినేవారు. కావున వారు నీ వద్దకు (న్యాయానికి) వస్తే, నీవు (ఇష్టపడితే) వారి మధ్య తీర్పు చేయి, లేదా ముఖం త్రిప్పుకో. నీవు వారి నుండి విముఖుడవైతే వారు నీకేమీ హాని చేయ లేరు. నీవు వారి మధ్య తీర్పు చేస్తే, న్యాయంగా మాత్రమే తీర్పు చేయి. నిశ్చయంగా, అల్లాహ్ న్యాయబద్ధులైన వారిని ప్రేమిస్తాడు.
وَكَيۡفَ يُحَكِّمُونَكَ وَعِندَهُمُ ٱلتَّوۡرَىٰةُ فِيهَا حُكۡمُ ٱللَّهِ ثُمَّ يَتَوَلَّوۡنَ مِنۢ بَعۡدِ ذَٰلِكَۚ وَمَآ أُوْلَـٰٓئِكَ بِٱلۡمُؤۡمِنِينَ
మరియు - అల్లాహ్ ఉత్తరువులు ఉన్న తౌరాత్ గ్రంథం వారి వద్ద ఉన్నప్పటికీ - వారు తీర్పు కొరకు, నీ వద్దకు ఎందుకు వస్తున్నారు? ఆ తరువాత కూడా వారు దాని నుండి తిరిగి పోతున్నారు మరియు ఇలాంటి వారు (నిజానికి) విశ్వసించిన వారు కారు.
إِنَّآ أَنزَلۡنَا ٱلتَّوۡرَىٰةَ فِيهَا هُدٗى وَنُورٞۚ يَحۡكُمُ بِهَا ٱلنَّبِيُّونَ ٱلَّذِينَ أَسۡلَمُواْ لِلَّذِينَ هَادُواْ وَٱلرَّبَّـٰنِيُّونَ وَٱلۡأَحۡبَارُ بِمَا ٱسۡتُحۡفِظُواْ مِن كِتَٰبِ ٱللَّهِ وَكَانُواْ عَلَيۡهِ شُهَدَآءَۚ فَلَا تَخۡشَوُاْ ٱلنَّاسَ وَٱخۡشَوۡنِ وَلَا تَشۡتَرُواْ بِـَٔايَٰتِي ثَمَنٗا قَلِيلٗاۚ وَمَن لَّمۡ يَحۡكُم بِمَآ أَنزَلَ ٱللَّهُ فَأُوْلَـٰٓئِكَ هُمُ ٱلۡكَٰفِرُونَ
నిశ్చయంగా, మేము తౌరాత్ ను (మూసాపై) అవతరింపజేశాము. అందులో మార్గదర్శకత్వం మరియు జ్యోతి ఉన్నాయి. అల్లాహ్ కు విధేయులైన (ముస్లింలైన) ప్రవక్తలు దానిని అనుసరించి, యూదుల మధ్య తీర్పు చేస్తూ ఉండేవారు.[1] అదే విధంగా ధర్మ వేత్తలు (రబ్బానియ్యూన్) మరియు యూద మతాచారులు (అహ్ బార్ లు) కూడా (తీర్పు చేస్తూ ఉండేవారు). ఎందుకంటే వారు అల్లాహ్ గ్రంథానికి రక్షకులుగా మరియు దానికి సాక్షులుగా నియమింపబడి ఉండేవారు. కావున మీరు (యూదులారా) మానవులకు భయపడ కండి. నాకే భయపడండి. నా సూక్తులను (ఆయాత్ లను) స్వల్ప లాభాలకు అమ్ము కోకండి. మరియు ఎవరు అల్లాహ్ అవతరింపజేసిన (శాసనం) ప్రకారం తీర్పు చేయరో, అలాంటి వారే సత్యతిరస్కారులు.
وَكَتَبۡنَا عَلَيۡهِمۡ فِيهَآ أَنَّ ٱلنَّفۡسَ بِٱلنَّفۡسِ وَٱلۡعَيۡنَ بِٱلۡعَيۡنِ وَٱلۡأَنفَ بِٱلۡأَنفِ وَٱلۡأُذُنَ بِٱلۡأُذُنِ وَٱلسِّنَّ بِٱلسِّنِّ وَٱلۡجُرُوحَ قِصَاصٞۚ فَمَن تَصَدَّقَ بِهِۦ فَهُوَ كَفَّارَةٞ لَّهُۥۚ وَمَن لَّمۡ يَحۡكُم بِمَآ أَنزَلَ ٱللَّهُ فَأُوْلَـٰٓئِكَ هُمُ ٱلظَّـٰلِمُونَ
మరియు ఆ గ్రంథం (తౌరాత్) లో వారికి మేము: "ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పన్నుకు బదులు పన్ను మరియు గాయాలకు బదులుగా సరిసమానమైన ప్రతీకారం వ్రాశాము.[1] కాని ఎవరైనా దానిని క్షమిస్తే, అది అతనికి పాపపరిహారం (కఫ్ఫారా)! మరియు ఎవరు అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చేయరో అలాంటి వారు! వారే దుర్మార్గులు.[2]
وَقَفَّيۡنَا عَلَىٰٓ ءَاثَٰرِهِم بِعِيسَى ٱبۡنِ مَرۡيَمَ مُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيۡهِ مِنَ ٱلتَّوۡرَىٰةِۖ وَءَاتَيۡنَٰهُ ٱلۡإِنجِيلَ فِيهِ هُدٗى وَنُورٞ وَمُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيۡهِ مِنَ ٱلتَّوۡرَىٰةِ وَهُدٗى وَمَوۡعِظَةٗ لِّلۡمُتَّقِينَ
మరియు మేము వారి (ఆ ప్రవక్తల) అడుగు జాడలను (ఆసారిహిమ్) అనుసరించేవాడు మరియు తౌరాత్ లో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరచే వాడయిన, మర్యమ్ కుమారుడు ఈసా (ఏసును) పంపాము.[1] మేము అతనికి ఇంజీల్ గ్రంథాన్ని ప్రసాదించాము. అందులో మార్గదర్శకత్వం మరియు జ్యోతి ఉన్నాయి మరియు అది తౌరాత్ లో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవీకరిస్తుంది మరియు దైవభీతి గల వారికి మార్గదర్శకత్వం మరియు హితోపదేశం కూడా!
وَلۡيَحۡكُمۡ أَهۡلُ ٱلۡإِنجِيلِ بِمَآ أَنزَلَ ٱللَّهُ فِيهِۚ وَمَن لَّمۡ يَحۡكُم بِمَآ أَنزَلَ ٱللَّهُ فَأُوْلَـٰٓئِكَ هُمُ ٱلۡفَٰسِقُونَ
మరియు ఇంజీల్ గ్రంథ ప్రజలను, అల్లాహ్! ఆ గ్రంథంలో అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చేయమను. మరియు ఎవరు అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చేయరో అలాంటి వారు, వారే అవిధేయులు (దుష్టులు).[1]
وَأَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ مُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيۡهِ مِنَ ٱلۡكِتَٰبِ وَمُهَيۡمِنًا عَلَيۡهِۖ فَٱحۡكُم بَيۡنَهُم بِمَآ أَنزَلَ ٱللَّهُۖ وَلَا تَتَّبِعۡ أَهۡوَآءَهُمۡ عَمَّا جَآءَكَ مِنَ ٱلۡحَقِّۚ لِكُلّٖ جَعَلۡنَا مِنكُمۡ شِرۡعَةٗ وَمِنۡهَاجٗاۚ وَلَوۡ شَآءَ ٱللَّهُ لَجَعَلَكُمۡ أُمَّةٗ وَٰحِدَةٗ وَلَٰكِن لِّيَبۡلُوَكُمۡ فِي مَآ ءَاتَىٰكُمۡۖ فَٱسۡتَبِقُواْ ٱلۡخَيۡرَٰتِۚ إِلَى ٱللَّهِ مَرۡجِعُكُمۡ جَمِيعٗا فَيُنَبِّئُكُم بِمَا كُنتُمۡ فِيهِ تَخۡتَلِفُونَ
మరియు (ఓ ప్రవక్తా!) మేము ఈ గ్రంథాన్ని నీపై సత్యంతో అవతరింపజేశాము. ఇది పూర్వ గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరుస్తుంది. మరియు వాటిలో ఉన్న సత్యాసత్యాలను పరిష్కరిస్తుంది.[1] కావున నీవు, అల్లాహ్ అవతరింపజేసిన ఈ శాసనం ప్రకారం వారి మధ్య తీర్పు చెయ్యి. మరియు నీ వద్దకు వచ్చిన సత్యాన్ని విడిచి వారి కోరికలను అనుసరించకు.[2] మీలో ప్రతి ఒక్క సంఘానికి ఒక ధర్మశాసనాన్ని మరియు ఒక జీవన మార్గాన్ని నియమించి ఉన్నాము. ఒకవేళ అల్లాహ్ తలుచుకుంటే, మిమ్మల్ని అంతా ఒకే ఒక సంఘంగా రూపొందించి ఉండేవాడు. కాని మీకు ఇచ్చిన దానితో (ధర్మంతో) మిమ్మల్ని పరీక్షించటానికి (ఇలా చేశాడు). కావున మీరు మంచి పనులు చేయటంలో ఒకరితో నొకరు పోటీ పడండి. అల్లాహ్ వద్దకే మీరందరూ మరలిపోవలసి వుంది. అప్పుడు ఆయన మీకున్న భేదాభిప్రాయాలను గురించి మీకు తెలియజేస్తాడు.
وَأَنِ ٱحۡكُم بَيۡنَهُم بِمَآ أَنزَلَ ٱللَّهُ وَلَا تَتَّبِعۡ أَهۡوَآءَهُمۡ وَٱحۡذَرۡهُمۡ أَن يَفۡتِنُوكَ عَنۢ بَعۡضِ مَآ أَنزَلَ ٱللَّهُ إِلَيۡكَۖ فَإِن تَوَلَّوۡاْ فَٱعۡلَمۡ أَنَّمَا يُرِيدُ ٱللَّهُ أَن يُصِيبَهُم بِبَعۡضِ ذُنُوبِهِمۡۗ وَإِنَّ كَثِيرٗا مِّنَ ٱلنَّاسِ لَفَٰسِقُونَ
మరియు (ఓ ప్రవక్తా!) నీవు అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం వారి మధ్య తీర్పు చెయ్యి మరియు వారి వ్యర్థ కోరికలను అనుసరించకు. అల్లాహ్ నీపై అవతరింపజేసిన కొన్ని శాసనాల నుండి వారు నిన్ను తప్పించకుండా జాగ్రత్తగా ఉండు. ఒకవేళ వారు వెనుదిరిగి పోతే, అల్లాహ్ వారిని, వారి కొన్ని పాపాలకు శిక్షించదలచాడని తెలుసుకో. మరియు నిశ్చయంగా, ప్రజలలో అనేకులు అవిధేయతకు పాల్పడే వారున్నారు.
أَفَحُكۡمَ ٱلۡجَٰهِلِيَّةِ يَبۡغُونَۚ وَمَنۡ أَحۡسَنُ مِنَ ٱللَّهِ حُكۡمٗا لِّقَوۡمٖ يُوقِنُونَ
ఏమీ? వారు అజ్ఞాన కాలపు తీర్పును కోరుతున్నారా? కాని ఆయన (అల్లాహ్) పై నమ్మకం గల వారికి అల్లాహ్ కంటే మంచి తీర్పు చేయగలవాడెవడు?[1]