సూరహ్ అల్-మైదా - తెలుగు అనువాదం, లిప్యంతరణ, తఫ్సీర్ - నుండి [100-110] వరకు

Read More
Read Less
 

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

 

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَسۡـَٔلُواْ عَنۡ أَشۡيَآءَ إِن تُبۡدَ لَكُمۡ تَسُؤۡكُمۡ وَإِن تَسۡـَٔلُواْ عَنۡهَا حِينَ يُنَزَّلُ ٱلۡقُرۡءَانُ تُبۡدَ لَكُمۡ عَفَا ٱللَّهُ عَنۡهَاۗ وَٱللَّهُ غَفُورٌ حَلِيمٞ

ఓ విశ్వాసులారా! వ్యక్త పరిస్తే మీకు బాధ కలిగించెడు విషయాలను గురించి, మీరు ప్రశ్నించకండి. ఖుర్ఆన్ అవతరింప జేయబడే టప్పుడు, మీరు వాటిని గురించి ప్రశ్నిస్తే! అవి మీకు విశదపరచ బడవచ్చు! వాటి కొరకు (ఇంత వరకు మీరు చేసిన ప్రశ్నల కొరకు) అల్లాహ్ మిమ్మల్ని మన్నించాడు మరియు అల్లాహ్ క్షమాశీలుడు, సహనశీలుడు.

قَدۡ سَأَلَهَا قَوۡمٞ مِّن قَبۡلِكُمۡ ثُمَّ أَصۡبَحُواْ بِهَا كَٰفِرِينَ

వాస్తవానికి మీకు పూర్వం ఒక జాతి వారు ఇటువంటి ప్రశ్నలనే అడిగారు. తరువాత వాటి (ఆ ప్రశ్నల) కారణంగానే వారు సత్యతిరస్కారానికి గురి అయ్యారు.[1]

مَا جَعَلَ ٱللَّهُ مِنۢ بَحِيرَةٖ وَلَا سَآئِبَةٖ وَلَا وَصِيلَةٖ وَلَا حَامٖ وَلَٰكِنَّ ٱلَّذِينَ كَفَرُواْ يَفۡتَرُونَ عَلَى ٱللَّهِ ٱلۡكَذِبَۖ وَأَكۡثَرُهُمۡ لَا يَعۡقِلُونَ

అల్లాహ్ బహీరహ్ ను గానీ, సాయిబహ్ ను గానీ, వసీలహ్ ను గానీ లేక హామ్ ను గానీ నియమించలేదు.[1] కాని సత్యతిరస్కారులు అల్లాహ్ పై అబద్ధాలు కల్పిస్తున్నారు. మరియు వారిలో చాలా మంది బుద్ధిహీనులే!

وَإِذَا قِيلَ لَهُمۡ تَعَالَوۡاْ إِلَىٰ مَآ أَنزَلَ ٱللَّهُ وَإِلَى ٱلرَّسُولِ قَالُواْ حَسۡبُنَا مَا وَجَدۡنَا عَلَيۡهِ ءَابَآءَنَآۚ أَوَلَوۡ كَانَ ءَابَآؤُهُمۡ لَا يَعۡلَمُونَ شَيۡـٔٗا وَلَا يَهۡتَدُونَ

మరియు వారితో: "అల్లాహ్ అవతరింప జేసిన దాని (సందేశం) వైపునకు మరియు ప్రవక్త వైపునకు రండి." అని పిలిచినప్పుడు! వారు: "మా తండ్రితాతలు అవలంబిస్తూ ఉండగా మేము చూసిన (మార్గమే) మాకు చాలు!" అని జవాబిస్తారు. ఏమీ? వారి తండ్రితాతలకు ఏమీ తెలియకున్నా మరియు వారు సన్మార్గం మీద లేకున్నా (వారి మార్గాన్నే వీరు అనుసరిస్తారా)?

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ عَلَيۡكُمۡ أَنفُسَكُمۡۖ لَا يَضُرُّكُم مَّن ضَلَّ إِذَا ٱهۡتَدَيۡتُمۡۚ إِلَى ٱللَّهِ مَرۡجِعُكُمۡ جَمِيعٗا فَيُنَبِّئُكُم بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ

ఓ విశ్వాసులారా! మీ స్వయానికి మీరు బాధ్యత వహించండి. మీరు సన్మార్గంలో ఉంటే, మార్గభ్రష్టులైన వారు మీకు ఎలాంటి హాని చేయలేరు.[1] మీరంతా అల్లాహ్ వైపునకే మరలి పోవలసి వుంది. అప్పుడు ఆయన మీరేమేమి చేస్తూ ఉండే వారో మీకు తెలియజేస్తాడు.

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ شَهَٰدَةُ بَيۡنِكُمۡ إِذَا حَضَرَ أَحَدَكُمُ ٱلۡمَوۡتُ حِينَ ٱلۡوَصِيَّةِ ٱثۡنَانِ ذَوَا عَدۡلٖ مِّنكُمۡ أَوۡ ءَاخَرَانِ مِنۡ غَيۡرِكُمۡ إِنۡ أَنتُمۡ ضَرَبۡتُمۡ فِي ٱلۡأَرۡضِ فَأَصَٰبَتۡكُم مُّصِيبَةُ ٱلۡمَوۡتِۚ تَحۡبِسُونَهُمَا مِنۢ بَعۡدِ ٱلصَّلَوٰةِ فَيُقۡسِمَانِ بِٱللَّهِ إِنِ ٱرۡتَبۡتُمۡ لَا نَشۡتَرِي بِهِۦ ثَمَنٗا وَلَوۡ كَانَ ذَا قُرۡبَىٰ وَلَا نَكۡتُمُ شَهَٰدَةَ ٱللَّهِ إِنَّآ إِذٗا لَّمِنَ ٱلۡأٓثِمِينَ

ఓ విశ్వాసులారా! మీలో ఎవరికైనా మరణ సమయం ఆసన్నమైతే, మీరు వీలునామా వ్రాసేటప్పుడు, మీలో న్యాయవర్తులైన ఇద్దరు వ్యక్తులను సాక్షులుగా తీసుకోండి. ఒకవేళ మీరు ప్రయాణ స్థితిలో ఉండి, అక్కడ మీకు మరణ ఆపద సంభవిస్తే, మీ వారు (ముస్లింలు లేకుంటే) ఇతరులను ఎవరినైనా ఇద్దరిని (సాక్షులుగా) తీసుకోవచ్చు. ఆ ఇద్దరినీ నమాజ్ తరువాత ఆపుకోండి. మీకు సందేహముంటే, వారిద్దరూ అల్లాహ్ పై ప్రమాణం చేసి ఇలా అనాలి: "మా దగ్గరి బంధువు కొరకైనా సరే మేము స్వార్థం కొరకు మా సాక్ష్యాన్ని అమ్మము. మేము అల్లాహ్ కొరకు ఇచ్చే సాక్ష్యాన్ని దాచము. మేము ఆ విధంగా చేస్తే నిశ్చయంగా, పాపాత్ములలో లెక్కింప బడుదుము గాక!"

فَإِنۡ عُثِرَ عَلَىٰٓ أَنَّهُمَا ٱسۡتَحَقَّآ إِثۡمٗا فَـَٔاخَرَانِ يَقُومَانِ مَقَامَهُمَا مِنَ ٱلَّذِينَ ٱسۡتَحَقَّ عَلَيۡهِمُ ٱلۡأَوۡلَيَٰنِ فَيُقۡسِمَانِ بِٱللَّهِ لَشَهَٰدَتُنَآ أَحَقُّ مِن شَهَٰدَتِهِمَا وَمَا ٱعۡتَدَيۡنَآ إِنَّآ إِذٗا لَّمِنَ ٱلظَّـٰلِمِينَ

కాని, ఆ తరువాత ఆ ఇద్దరు (సాక్షులు) పాపం చేశారని తెలిస్తే! అప్పుడు మొదటి ఇద్దరి (సాక్ష్యం) వలన హక్కును కోల్పోయిన వారి (బంధువుల)లో నుండి ఇద్దరు, మొదటి వారిద్దరికి బదులుగా నిలబడి అల్లాహ్ పై శపథం చేసి ఇలా అనాలి: "మా సాక్ష్యం వీరువురి సాక్ష్యం కంటే ఎక్కువ హక్కు గలది (సత్యమైనది). మరియు మేము ఏ విధమైన అక్రమానికి పాల్పడలేదు. మేము ఆ విధంగా చేస్తే నిశ్చయంగా, అన్యాయపరులలో చేరి పోదుము గాక!"

ذَٰلِكَ أَدۡنَىٰٓ أَن يَأۡتُواْ بِٱلشَّهَٰدَةِ عَلَىٰ وَجۡهِهَآ أَوۡ يَخَافُوٓاْ أَن تُرَدَّ أَيۡمَٰنُۢ بَعۡدَ أَيۡمَٰنِهِمۡۗ وَٱتَّقُواْ ٱللَّهَ وَٱسۡمَعُواْۗ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلۡفَٰسِقِينَ

ఇది (ఈ పద్ధతి) ప్రజలు నిజమైన సాక్ష్యం ఇవ్వటానికి లేదా వారి ప్రమాణాలను, తరువాత తీసుకొనబడే ప్రమాణాలు ఖండిస్తాయని వారిని భయపెట్టటానికి ఉత్తమమైనది. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండి, (ఆయన ఆదేశాలను) వినండి. మరియు అల్లాహ్ అవిధేయులకు సన్మార్గం చూపడు.

۞يَوۡمَ يَجۡمَعُ ٱللَّهُ ٱلرُّسُلَ فَيَقُولُ مَاذَآ أُجِبۡتُمۡۖ قَالُواْ لَا عِلۡمَ لَنَآۖ إِنَّكَ أَنتَ عَلَّـٰمُ ٱلۡغُيُوبِ

ఆ రోజు అల్లాహ్ ప్రవక్తలందరిని సమావేశపరచి: "మీకేమి జవాబు ఇవ్వబడింది?" అని అడిగితే! వారు: "మాకు యథార్థ జ్ఞానం లేదు! నిశ్చయంగా, నీవు మాత్రమే సర్వ అగోచర విషయాల జ్ఞానం గలవాడవు." అని పలుకుతారు.[1]

إِذۡ قَالَ ٱللَّهُ يَٰعِيسَى ٱبۡنَ مَرۡيَمَ ٱذۡكُرۡ نِعۡمَتِي عَلَيۡكَ وَعَلَىٰ وَٰلِدَتِكَ إِذۡ أَيَّدتُّكَ بِرُوحِ ٱلۡقُدُسِ تُكَلِّمُ ٱلنَّاسَ فِي ٱلۡمَهۡدِ وَكَهۡلٗاۖ وَإِذۡ عَلَّمۡتُكَ ٱلۡكِتَٰبَ وَٱلۡحِكۡمَةَ وَٱلتَّوۡرَىٰةَ وَٱلۡإِنجِيلَۖ وَإِذۡ تَخۡلُقُ مِنَ ٱلطِّينِ كَهَيۡـَٔةِ ٱلطَّيۡرِ بِإِذۡنِي فَتَنفُخُ فِيهَا فَتَكُونُ طَيۡرَۢا بِإِذۡنِيۖ وَتُبۡرِئُ ٱلۡأَكۡمَهَ وَٱلۡأَبۡرَصَ بِإِذۡنِيۖ وَإِذۡ تُخۡرِجُ ٱلۡمَوۡتَىٰ بِإِذۡنِيۖ وَإِذۡ كَفَفۡتُ بَنِيٓ إِسۡرَـٰٓءِيلَ عَنكَ إِذۡ جِئۡتَهُم بِٱلۡبَيِّنَٰتِ فَقَالَ ٱلَّذِينَ كَفَرُواْ مِنۡهُمۡ إِنۡ هَٰذَآ إِلَّا سِحۡرٞ مُّبِينٞ

(జ్ఞాపకముంచుకోండి!) అప్పుడు (పునరుత్థాన దినమున), అల్లాహ్: "ఓ మర్యమ్ కుమారుడా! ఈసా (ఏసు) నేను నీకు మరియు నీ తల్లికి ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకో! నేను పరిశుద్ధాత్మ (రూహుల్ ఖుదుస్)[1] ద్వారా నిన్ను బలపరిచాను, నీవు ఉయ్యాలలోనూ మరియు యుక్తవయస్సులోనూ ప్రజలతో మాట్లాడేవాడివి. మరియు నేను గ్రంథాన్ని మరియు వివేకాన్ని, తౌరాతును మరియు ఇంజీలును నీకు నేర్పాను.[2] మరియు నీవు నా ఆజ్ఞతో పక్షి ఆకారం గల మట్టి బొమ్మను తయారు చేసి, దానిలో ఊదినపుడు, నా ఆజ్ఞతో అది పక్షిగా మారి పోయేది. మరియు నీవు పుట్టుగ్రుడ్డిని మరియు కుష్ఠురోగిని నా ఆజ్ఞతో బాగు చేసేవాడివి. మరియు నీవు నా ఆజ్ఞతో మృతులను లేపేవాడివి.[3] మరియు నీవు స్పష్టమైన సూచనలతో ఇస్రాయీలు సంతతి వారి వద్దకు వచ్చినపుడు,[4] వారిలోని సత్యతిరస్కారులు: "ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు!" అని అన్నారు. అప్పుడు నేను వారి కుట్ర నుండి నిన్ను కాపాడాను!

Surah telugu Translation and Transliteration

In Surah you can read the translation of Ahmad Raza Khan who was a renowned scholar of the Islamic world and his translation book is known as Kanzul Imaan. You can read the transliteration of Surah which will help you to understand how to read the Arabic text. Apart from that, we have included a Word-By-Word telugu Translation of the Arabic text of Surah .

Surah telugu Tafsir/Tafseer (Commentry)

In Surah we have included two Tafseer (Commentary) in telugu. The first one is from Mufti Ahmad Yaar Khan who was a well-known scholar. In this tafsir, we have also included the most popular Tafsir Ibn-Kathir which is the most comprehensive tafsir available in the world. You can read both or any one of your choice.

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now