కురాన్ - 16:102 సూరా సూరా నహల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

قُلۡ نَزَّلَهُۥ رُوحُ ٱلۡقُدُسِ مِن رَّبِّكَ بِٱلۡحَقِّ لِيُثَبِّتَ ٱلَّذِينَ ءَامَنُواْ وَهُدٗى وَبُشۡرَىٰ لِلۡمُسۡلِمِينَ

వారితో అను: "దీనిని (ఈ ఖుర్ఆన్ ను) నీ ప్రభువు వద్ద నుండి సత్యంతో, విశ్వాసులను (విశ్వాసంలో) పటిష్టం చేయటానికి మరియు (అల్లాహ్ కు) సంపూర్ణంగా విధేయులుగా ఉన్న వారికి (ముస్లింలకు) సన్మార్గం చూపటానికి మరియు శుభవార్త అందజేయటానికి, పరిశుద్ధాత్మ (జిబ్రీల్)[1] క్రమక్రమంగా ఉన్నది ఉన్నట్లుగా తీసుకొని వచ్చాడు."

సూరా సూరా నహల్ ఆయత 102 తఫ్సీర్


[1] జిబ్రీల్ ('అ.స.) ను సంబోధిస్తూ, రూ'హుల్ ఖుద్స్, అని ఖుర్ఆన్ లో నాలుగు సార్లు వచ్చింది. ఇక్కడ మరియు 2:87, 253; 5:110లలో. రూ'హుల్ అమీన్, అని 26:193లో వచ్చింది. రూ'హ్, అని మూడు సార్లు, 78:38, 19:17, 97:4లలో వచ్చింది. కాని 16:2, 42:52లలో మాత్రం రూ'హ్, దివ్యజ్ఞానం అనే అర్థం ఇస్తుంది.

సూరా నహల్ అన్ని ఆయతలు

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now