కురాన్ - 16:90 సూరా సూరా నహల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

۞إِنَّ ٱللَّهَ يَأۡمُرُ بِٱلۡعَدۡلِ وَٱلۡإِحۡسَٰنِ وَإِيتَآيِٕ ذِي ٱلۡقُرۡبَىٰ وَيَنۡهَىٰ عَنِ ٱلۡفَحۡشَآءِ وَٱلۡمُنكَرِ وَٱلۡبَغۡيِۚ يَعِظُكُمۡ لَعَلَّكُمۡ تَذَكَّرُونَ

నిశ్చయంగా, అల్లాహ్ న్యాయం చేయమని మరియు (ఇతరులకు) మేలు చేయమని మరియు దగ్గరి బంధువులకు సహాయం చేయమని మరియు అశ్లీలత, అధర్మం మరియు దౌర్జన్యాలకు దూరంగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు.[1] ఆయన ఈ విధంగా మీకు బోధిస్తున్నాడు, బహుశా మీరు హితబోధ గ్రహిస్తారని.

సూరా సూరా నహల్ ఆయత 90 తఫ్సీర్


[1] అల్-'అద్లు: తన వారితోనే కాక ఇతరులతో కూడా న్యాయం చేయటం. ఎవరితోనైనా ఉన్న ప్రేమ లేక శత్రుత్వం, న్యాయానికి అడ్డు రాకూడదు. మరొక అర్థం న్యాయంలో హెచ్చు తగ్గులు చేయగూడదు. ధర్మవిషయంలో కూడా ఏ విధమైన అన్యాయం జరుగకూడదు. అల్-ఎ'హ్సాను: అంటే, ఒకటి: మంచినడవడిక మరియు క్షమాగుణం. రెండోది: న్యాయంగా ఇవ్వవలసిన దాని కంటే ఎక్కువ ఇవ్వటం. ఉదా: నూరు రూపాయలు కూలి మాట్లాడుకున్న వానికి పని ముగిసిన తరువాత 110 రూపాయలు ఇవ్వటం. మూడవది: ఏ పని చేసినా కర్తవ్యంగా హృదయపూర్వకంగా చేయటం మరియు ఏకాగ్రచిత్తంతో అల్లాహ్ (సు.తా.)ను ఆరాధించటం (అన్ త'అబుదుల్లాహ్ క అన్నక తరాహు). అల్-ఫ'హ్ షా ఉ': అశ్లీలత, చెడు నడత, అసభ్యకరమైన పని, సిగ్గుమాలిన నడవడిక. ఈ కాలంలో ఫ్యాషన్ పేరు మీద జరిగేవి. స్త్రీపురుషులు సిగ్గు విడిచి, కలసి మెలసి తిరుగటం, డాన్సులు చేయటం, మొదలైనవి. అల్-మున్కరు: షరీయత్ నిషేధించిన పని. అల్-బ'గీ: ఆందోళన, అక్రమము, దౌర్జన్యం.

సూరా నహల్ అన్ని ఆయతలు

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now