కురాన్ - 52:21 సూరా సూరా తూర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَٱلَّذِينَ ءَامَنُواْ وَٱتَّبَعَتۡهُمۡ ذُرِّيَّتُهُم بِإِيمَٰنٍ أَلۡحَقۡنَا بِهِمۡ ذُرِّيَّتَهُمۡ وَمَآ أَلَتۡنَٰهُم مِّنۡ عَمَلِهِم مِّن شَيۡءٖۚ كُلُّ ٱمۡرِيِٕۭ بِمَا كَسَبَ رَهِينٞ

మరియు ఎవరైతే విశ్వసిస్తారో మరియు వారి సంతానంవారు విశ్వాసంలో వారిని అనుసరిస్తారో! అలాంటి వారిని వారి సంతానంతో (స్వర్గంలో) కలుపుతాము.[1] మరియు వారి కర్మలలో వారికి ఏ మాత్రం నష్టం కలిగించము. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన దానికి తాకట్టుగా ఉంటాడు.[2]

సూరా సూరా తూర్ ఆయత 21 తఫ్సీర్


[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'మానవుడు మరణిస్తే అతని కర్మలు ఆగిపోతాయి. కాని మూడు విషయాల పుణ్యఫలితం మరణించిన తరువాత కూడా దొరుకుతూ ఉంటుంది. 1) సదఖహ్ జారియహ్, 2) అతడు వదిలిన జ్ఞానం - దేనితోనైతే ఇతరులు లాభం పొందుతూ ఉంటారో! 3) సద్వర్తనులైన సంతానం - ఎవరైతే అతని కొరకు ప్రార్థిస్తూ ఉంటారో!' ('స.ముస్లిం). [2] ఇటువంటి ఆయత్ కే చూడండి, 74:38.

సూరా తూర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter