కురాన్ - 2:115 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).
وَلِلَّهِ ٱلۡمَشۡرِقُ وَٱلۡمَغۡرِبُۚ فَأَيۡنَمَا تُوَلُّواْ فَثَمَّ وَجۡهُ ٱللَّهِۚ إِنَّ ٱللَّهَ وَٰسِعٌ عَلِيمٞ
మరియు తూర్పు పడమరలు అల్లాహ్ కే చెందినవి. కావున మీరు (మీ ముఖాలను) ఏ దిక్కుకు త్రిప్పినా మీకు అల్లాహ్ సముఖమే లభిస్తుంది. నిశ్చయంగా, అల్లాహ్, సర్వవ్యాప్తి,[1] సర్వజ్ఞుడు.
[1] అల్-వాసి'ఉ: The All-Embracing, Infinite, Pervading, Bountiful, Comprehending all, Having ample Powr or ability. Has full knowledge of all things, All-Sufficient, సర్వవ్యాప్తి, సర్వోపగతుడు, విస్తారుడు, అంతం లేనివాడు, అపారుడు, అత్యంత ఉదారుడు, సంపలొసంగు వాడు, అల్లాహ్ జ్ఞానం ప్రతి దానిని ఆవరించు (ఇముడ్చు)కొని ఉంది. దివ్యఖుర్ఆన్ లో, వాసి'ఉన్ 'అలీమున్ అనే పదాలు ఇంకా 6 చోట్లలో వచ్చాయి. అవి: 2:247, 261, 268, 3:73, 5:54, 24:32. ఈ రెండూ అల్లాహుతా'ఆలా అత్యుత్తమ పేర్లు. ఇంకా చూడండి, వాసి'ఉన్ కొరకు, 4:130, 7:156, 53:32.
సూరా సూరా బకరా ఆయత 115 తఫ్సీర్