కురాన్ - 2:17 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

مَثَلُهُمۡ كَمَثَلِ ٱلَّذِي ٱسۡتَوۡقَدَ نَارٗا فَلَمَّآ أَضَآءَتۡ مَا حَوۡلَهُۥ ذَهَبَ ٱللَّهُ بِنُورِهِمۡ وَتَرَكَهُمۡ فِي ظُلُمَٰتٖ لَّا يُبۡصِرُونَ

వారి ఉపమానం[1] ఇలా ఉంది:[2] ఒక అగ్నిని వెలిగించగా, అది పరిసరాలను ప్రకాశింపజేసిన తర్వాత అల్లాహ్ వారి వెలుగును తీసుకుని వారిని అంధకారంలో విడిచి పెట్టడం వల్ల, వారు ఏమీ చూడలేక పోతారు.

సూరా సూరా బకరా ఆయత 17 తఫ్సీర్


[1] మస'లున్: అంటే ఉపమానం, పోలిక, సాదృశ్యం, దృష్టాంతం అనే అర్థాలున్నాలు. [2] 'అబ్దుల్లాహ్ బిన్-మస్'ఊద్ (ర'ది. 'అ.) కథనం (ఫ'త్హ్ అల్-ఖదీర్): మహాప్రవక్త ('స'అస), మదీనాకు వచ్చిన తరువాత విశ్వసించిన వారిలో కొందరు కాపట్యానికి లోనవుతారు. అంటే వారు ఇస్లాం వెలుగును పొందిన తరువాత దానిని విడిచి మరల అంధకారంలో చిక్కుకు పోతారు. ఆ విషయం ఈ విధంగా బోధించబడింది. ఒక వ్యక్తి రాత్రిలో ఎడారిలో మంట వెలిగించి కాపుకుంటాడు. అది వారి పరిసరాలను వెలిగిస్తుంది. కాని ఆ అగ్ని ఆరి పోగానే వారు మళ్ళీ అంధకారంలో చిక్కు కుంటారు. ఏమీ చూడ లేక పోతారు. అదే విధంగా బాహ్యంగా మాత్రమే ఇస్లాం స్వీకరించిన వారి హృదయాలు అంధకారంలో ఉండి పోతాయి. వారు ఇస్లాం వెలుగును పొందిన తరువాత కూడా అంధకారంలోనే ఉండి పోతారు.

Sign up for Newsletter