కురాన్ - 2:125 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَإِذۡ جَعَلۡنَا ٱلۡبَيۡتَ مَثَابَةٗ لِّلنَّاسِ وَأَمۡنٗا وَٱتَّخِذُواْ مِن مَّقَامِ إِبۡرَٰهِـۧمَ مُصَلّٗىۖ وَعَهِدۡنَآ إِلَىٰٓ إِبۡرَٰهِـۧمَ وَإِسۡمَٰعِيلَ أَن طَهِّرَا بَيۡتِيَ لِلطَّآئِفِينَ وَٱلۡعَٰكِفِينَ وَٱلرُّكَّعِ ٱلسُّجُودِ

మరియు ఈ (కఅబహ్) గృహాన్ని మేము మానవులను తరచుగా సందర్శించే కేంద్రం (పుణ్యస్థలం)గా మరియు శాంతి నిలయంగా చేసి,[1] ఇబ్రాహీమ్ నిలబడిన చోటును మీరు నమాజ్ చేసే స్థలంగా చేసుకోండన్న[2] విషయాన్ని (జ్ఞాపకం చేసుకోండి). మరియు మేము ఇబ్రాహీమ్ మరియు ఇస్మాయీల్ లకు: "నా ఈ గృహాన్ని ప్రదక్షిణ చేసేవారి కొరకూ, ఏకాంత ధ్యానం (ఏతికాఫ్) పాటించేవారి కొరకూ, వంగే (రుకూఉ చేసే) వారి కొరకూ మరియు సజ్దాలు చేసే వారి కొరకూ పరిశుద్ధంగా ఉంచండి." అని నిర్దేశించాము.

సూరా సూరా బకరా ఆయత 125 తఫ్సీర్


[1] మసా'బతల్లిన్నాస్ : అంటే, ప్రజల కొరకు పుణ్యస్థలం. దీని మరొక అర్థం, మాటిమాటికీ సందర్శించే కేంద్రం. ఎందుకంటే ఒకసారి అల్లాహ్ (సు.తా.) గృహాన్ని సందర్శించినవాడు, మళ్ళీ మళ్ళీ దానిని దర్శించాలని కోరుతూ ఉంటాడు. దీని మరొక మహత్త్వమేమిటంటే, ఇది శాంతి కేంద్రం. అంటే ఇక్కడ ఏ శత్రువు భయం ఉండదు. అందుకే అజ్ఞాన కాలంలో కూడా ముష్రిక్ లు 'హరమ్ సరిహద్దులలో తమ శత్రువులతో పోరాడటం గానీ, హత్యలు గానీ చేసేవారు కాదు. [2] మఖామె ఇబ్రాహీమ్: అంటే ఇబ్రాహీమ్ ('అ.స.) నిలబడిన రాయి. అతను దానిపైన నిలబడి క'అబహ్ గృహాన్ని నిర్మించారు. అది 'హరమ్ లో క'అబహ్ కు దగ్గరగా ఉంది. 'తవాఫ్ పూర్తి చేసిన వారు ప్రతి ఒక్కరూ, దాని దగ్గరలో రెండు రకా'అతులు నమా'జ్ చేస్తారు.

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now