కురాన్ - 2:35 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَقُلۡنَا يَـٰٓـَٔادَمُ ٱسۡكُنۡ أَنتَ وَزَوۡجُكَ ٱلۡجَنَّةَ وَكُلَا مِنۡهَا رَغَدًا حَيۡثُ شِئۡتُمَا وَلَا تَقۡرَبَا هَٰذِهِ ٱلشَّجَرَةَ فَتَكُونَا مِنَ ٱلظَّـٰلِمِينَ

మరియు మేము (ఆదమ్ తో) అన్నాము: "ఓ ఆదమ్! నీవూ మరియు నీ భార్యా, ఈ స్వర్గంలో నివసించండి మరియు మీరిద్దరూ మీకు ఇష్టమైనది యథేచ్ఛగా తినండి, కానీ ఈ చెట్టు[1] దరిదాపులకు పోకండి, అలా చేస్తే మీరిద్దరూ దుర్మార్గులలో[2] చేరిన వారవుతారు!"

సూరా సూరా బకరా ఆయత 35 తఫ్సీర్


[1] ఆ చెట్టు ఏ రకమైనదో ఖుర్ఆన్ మరియు 'హదీస్'లలో పేర్కొనబడలేదు. కాబట్టి దానిని గురించి అనుమానాల పాలు కాగూడదు. ఇంకా చూడండి, 20:120. [2] "జుల్ మున్: Wrong doing, Injustice, Oppression. ఈ పదానికి దుర్మార్గం, అన్యాయం, అధర్మం, అక్రమం, దోషం, అపచారం మొదలైన అర్థాలు ఉన్నాయి.

Sign up for Newsletter