కురాన్ - 2:20 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

يَكَادُ ٱلۡبَرۡقُ يَخۡطَفُ أَبۡصَٰرَهُمۡۖ كُلَّمَآ أَضَآءَ لَهُم مَّشَوۡاْ فِيهِ وَإِذَآ أَظۡلَمَ عَلَيۡهِمۡ قَامُواْۚ وَلَوۡ شَآءَ ٱللَّهُ لَذَهَبَ بِسَمۡعِهِمۡ وَأَبۡصَٰرِهِمۡۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ

ఆ మెరుపు వారి దృష్టిని ఇంచు మించు ఎగుర వేసుకు పోయినట్లుంటుంది. ప్రతిసారి అది మెరిసినప్పుడు, వారు ముందుకు నడుస్తారు మరియు వారిపై చీకటి క్రమ్ము కొనగానే వారు ఆగిపోతారు. మరియు అల్లాహ్ కోరితే వారి వినికిడినీ మరియు వారి చూపునూ తొలగించే వాడు.[1] నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.[2]

సూరా సూరా బకరా ఆయత 20 తఫ్సీర్


[1] అల్లాహుతా 'ఆలా తలుచుకుంటే ఎప్పుడైనా తాను ప్రసాదించే అనుగ్రహాలను ఆపుకోవచ్చు! కావున మానవులు ఎల్లప్పుడు అల్లాహుతా 'ఆలా యందే భయభక్తులు కలిగి వుండి, ఆయన శిక్షకూ, ప్రతీకారానికీ భయపడుతూ ఉండాలి. [2] అలా కుల్లి ,షయ్ఇ'న్ ఖదీర్: ఈ వాక్యాన్ని కొందరు: "అన్నింటిపై అధికారం (ఆధిపత్యం) గలవాడు." అని కూడా అనువదించారు.

Sign up for Newsletter