కురాన్ - 2:223 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

نِسَآؤُكُمۡ حَرۡثٞ لَّكُمۡ فَأۡتُواْ حَرۡثَكُمۡ أَنَّىٰ شِئۡتُمۡۖ وَقَدِّمُواْ لِأَنفُسِكُمۡۚ وَٱتَّقُواْ ٱللَّهَ وَٱعۡلَمُوٓاْ أَنَّكُم مُّلَٰقُوهُۗ وَبَشِّرِ ٱلۡمُؤۡمِنِينَ

మీ భార్యలు మీకు పంటపొలాల వంటి వారు, కావున మీ పొలాలకు మీరు కోరిన విధంగా పోవచ్చు[1]. మరియు మీ స్వయం కొరకు (సత్కార్యాలు) చేసి పంపండి (మీకు మంచి సంతానం కొరకు ప్రార్థించండి). మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు నిశ్చయంగా ఆయనను కలసుకోవలసి ఉందని తెలుసుకోండి. మరియు విశ్వాసులకు శుభవార్తలను వినిపించు.

సూరా సూరా బకరా ఆయత 223 తఫ్సీర్


[1] ఇక్కడ పంటపొలం అంటే సంతానం ఇచ్చేవారు. ఏ విధంగానైతే పొలం నుండి ఫలం లభిస్తుందో అదే విధంగా స్త్రీల నుండి సంతతి ఫలిస్తుంది. ఇక్కడ కూడా మీరు కొరిన పద్ధతిలో పంటపొలంలోకి మాత్రమే పొండి, కాని ఇతర చోట్ల నుండి పోకండి అంటే స్త్రీ మర్మాంగం నుండే సంభోగం చేయండి. ఇతర మార్గాల ద్వారా చేయకండి అని భావం. (ఇబ్నె-కసీ'ర్).

Sign up for Newsletter