కురాన్ - 2:138 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

صِبۡغَةَ ٱللَّهِ وَمَنۡ أَحۡسَنُ مِنَ ٱللَّهِ صِبۡغَةٗۖ وَنَحۡنُ لَهُۥ عَٰبِدُونَ

(వారితో ఇలా అను): "(మీరు) అల్లాహ్ రంగును (ధర్మాన్ని) స్వీకరించండి. మరియు అల్లాహ్ కంటే మంచి రంగు (ధర్మం) ఎవరిది? మరియు మేము ఆయనను మాత్రమే ఆరాధించేవారము.[1]"

సూరా సూరా బకరా ఆయత 138 తఫ్సీర్


[1] దీని మరొక తాత్పర్యం ఇలా ఉంది: 'అల్లాహ్ రంగును (ధర్మాన్ని) ఎంచుకోండి. మరియు అల్లాహ్ రంగు (ధర్మం) కంటే ఉత్తమమైన రంగు (ధర్మం) ఎవరిది? మరియు మేము ఆయనను మాత్రమే ఆరాధించే వారము.' క్రైస్తవులు ఒక పసుపురంగు చేసి ఉంచుతారు. బిడ్డ పుట్టినా లేక ఎవడైనా క్రైస్తవ మతం అవలంబించినా! వారు, అతనిని ఆ రంగులో ముంచి: 'పవిత్రమైన క్రైస్తవుడయ్యాడు.' అని అంటారు. దీనిని బాప్టిసం (Baptism) అంటారు. ఈ ఆచారాన్ని ఖండిస్తూ : అల్లాహ్ (సు.తా.) రంగు (ధర్మం) అంటే ఇస్లాం ధర్మమే, అంటే అల్లాహ్ (సు.తా.) కు విధేయులై కేవలం ఆయననే ఆరాధించడం. ఇదే ప్రవక్తలందరూ బోధించిన ధర్మం, అని విశదపరచబడింది.

Sign up for Newsletter