కురాన్ - 2:142 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

۞سَيَقُولُ ٱلسُّفَهَآءُ مِنَ ٱلنَّاسِ مَا وَلَّىٰهُمۡ عَن قِبۡلَتِهِمُ ٱلَّتِي كَانُواْ عَلَيۡهَاۚ قُل لِّلَّهِ ٱلۡمَشۡرِقُ وَٱلۡمَغۡرِبُۚ يَهۡدِي مَن يَشَآءُ إِلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ

ప్రజలలోని కొందరు మూఢజనులు ఇలా అంటారు: "వీరిని (ముస్లింలను) ఇంత వరకు వీరు అనుసరిస్తూ వచ్చిన, ఖిబ్లా నుండి త్రిప్పింది ఏమిటి?"[1] వారితో ఇలా అను: "తూర్పు మరియు పడమరలు అల్లాహ్ కే చెందినవి. ఆయన తాను కోరిన వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు."

సూరా సూరా బకరా ఆయత 142 తఫ్సీర్


[1] మ'హా ప్రవక్త ('స'అస) మదీనాకు వలస పోయిన తరువాత 16, 17 నెలలు బైతుల్ మఖ్దిస్ వైపునకు ముఖం చేసి నమాజ్' చేసేవారు. కాని అతని కోరిక క'అబహ్ (మక్కా) వైపుకు మాత్రమే ముఖం చేసి నమాజ్' చేయాలని ఉండేది. ఇదే ఇబ్రాహీమ్ ('అ.స.) యొక్క ఖిబ్లా కూడాను. మహా ప్రవక్త ('స'అస) దీనికై ఎన్నోసార్లు అల్లాహ్ (సు.తా.)ను ప్రార్థించారు. చివరకు అల్లాహుతా'ఆలా ఖిబ్లాను మార్చమని మహా ప్రవక్త ('స'అస)కు ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు అవిశ్వాసులు ఈ విధంగా అన్నారు.

Sign up for Newsletter