కురాన్ - 2:76 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَإِذَا لَقُواْ ٱلَّذِينَ ءَامَنُواْ قَالُوٓاْ ءَامَنَّا وَإِذَا خَلَا بَعۡضُهُمۡ إِلَىٰ بَعۡضٖ قَالُوٓاْ أَتُحَدِّثُونَهُم بِمَا فَتَحَ ٱللَّهُ عَلَيۡكُمۡ لِيُحَآجُّوكُم بِهِۦ عِندَ رَبِّكُمۡۚ أَفَلَا تَعۡقِلُونَ

మరియు వారు (యూదులు) విశ్వాసులను కలిసినప్పుడు: "మేము విశ్వసించాము!" అని అంటారు. కాని వారు ఏకాంతంలో (తమ తెగవారితో) ఒకరినొకరు కలుసుకున్నప్పుడు: "ఏమీ? అల్లాహ్ మీకు తెలిపింది వారికి (ముస్లింలకు) తెలుపుతారా![1] దానితో వారు (ముస్లింలు) మీ ప్రభువు ముందు మీతో వాదులాడటానికి! మీరిది అర్థం చేసుకోలేరా ఏమిటి?" అని అంటారు.

సూరా సూరా బకరా ఆయత 76 తఫ్సీర్


[1] 'అబ్దుల్లాహ్ బిన్- 'అమ్ర్ బిన్ అల్-'అసాస్ (ర.ది.'అ.), కథనం ఆదారంగా - 'అతా బిన్-యాసిర్ (ర'ది. 'అ.) వివరించిన - వారి గ్రంథం (తౌరాత్)లో రాబోయే ప్రవక్త ము'హమ్మద్ ('స 'అస) ను గురించి ఇవ్వబడిన లక్షణాల వివరాలకు చూడండి, ('స. బు'ఖారీ, పుస్తకం-3, 'హ.నం. 335) ఇంకా చూడండి, 2:42, 101.

Sign up for Newsletter