కురాన్ - 2:255 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلۡحَيُّ ٱلۡقَيُّومُۚ لَا تَأۡخُذُهُۥ سِنَةٞ وَلَا نَوۡمٞۚ لَّهُۥ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۗ مَن ذَا ٱلَّذِي يَشۡفَعُ عِندَهُۥٓ إِلَّا بِإِذۡنِهِۦۚ يَعۡلَمُ مَا بَيۡنَ أَيۡدِيهِمۡ وَمَا خَلۡفَهُمۡۖ وَلَا يُحِيطُونَ بِشَيۡءٖ مِّنۡ عِلۡمِهِۦٓ إِلَّا بِمَا شَآءَۚ وَسِعَ كُرۡسِيُّهُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَۖ وَلَا يَـُٔودُهُۥ حِفۡظُهُمَاۚ وَهُوَ ٱلۡعَلِيُّ ٱلۡعَظِيمُ

అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు.[1] ఆయన సజీవుడు, [2]విశ్వవ్యవస్థకు ఆధార భూతుడు. [3] ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే. ఆయన సమ్ముఖంలో - ఆయన అనుజ్ఞ లేకుండా - సిఫారసు చేయగల వాడెవడు? వారి ముందున్నదీ మరియు వారి వెనుక నున్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు.[4] మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానవిశేషాలలో ఏ విషయమునూ వారు గ్రహించజాలరు. ఆయన కుర్సీ [5] ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష్ఠించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన మహోన్నతుడు,[6] సర్వోత్తముడు.

సూరా సూరా బకరా ఆయత 255 తఫ్సీర్


[1] ఈ ఆయత్ ఆయతుల్ - కుర్సీ అనబడుతుంది. 'హదీస్' లలో దీని యొక్క ఎన్నో శుభాలు పేర్కొనబడ్డాయి. దీనిని రాత్రి నిద్రపోవటానికి ముందు చదువటం వలన రాత్రంతా షై'తాన్ నుండి రక్షణ దొరుకుతుంది. ప్రతి నమా'జ్ తర్వాత కూడా చదివితే ఎన్నో పుణ్యాలు ఉన్నాయి. ఇందులో అల్లాహుతా'ఆలా యొక్క ఏకత్వం మరియు ఆయన మహిమలు చెప్పబడ్డాయి. [2] అల్ - 'హయ్యు: The Ever-Living. సజీవుడు, నిత్యుడు, నిత్యజీవుడు. [3] అల్ - ఖయ్యూమ్: By whom all things subsist. విశ్వవ్యవస్థకు ఆధారభూతుడు, శాశ్వితుడు. [4] తఫ్సీర్ అల్ - ముయస్సర్ లో దీని తాత్పర్యం ఈ విధంగా ఇవ్వబడింది: "వారికి ముందు సంభవించనున్నది మరియు ఇంతకు ముందు సంభవించిందీ అన్నీ అల్లాహ్ (సు.తా.) కు బాగా తెలుసు." దీని మరొక తాత్పర్యం ఇలా ఉంది : "వారికి ముందు (పరలోకంలో) సంభవించనున్నదీ మరియు వెనక (ఇహలోకంలో) సంభవించిందీ, అన్నీ అల్లాహుతా'ఆలా కు బాగా తెలుసు." [5] కుర్సీ: కొందరు వ్యాఖ్యాతలు దీనిని, పాదాలు పెట్టే చోటన్నారు. కొందరు జ్ఞానం, మరికొందరు విశ్వసామ్రాజ్యాధిపత్యం, మరికొందరు సింహాసనం ('అర్ష్) అన్నారు. కాని అల్లాహ్ (సు.తా.) యొక్క 'సిఫాత్ లను దివ్యఖుర్ఆన్ మరియు 'స'హీ'హ్ 'హదీస్' లలో బోధించినట్లుగా, వాటికి ఏ విధమైన తాత్పర్యాలు ఇవ్వకుండా వాటిని విశ్వసించాలి. అంటే ఇది ఒక కుర్సీ, 'అర్ష్ కాదు, మరొకటి. అది ఎలా ఉంటుంది, దానిపై అల్లాహుతా'ఆలా ఎలా కూర్చుంటాడు మేము వివరించలేము, ఎందుకంటే ఆ వాస్తవం మనకు తెలియదు. [6] అల్ - 'అలియ్యు : The Most High, He above whom is nothing. మహోన్నతుడు, అత్యున్నతుడు. చూడండి, 6:100. ఇంకా చూడండి, అల్ - ముత'ఆలి, 13:9, సర్వోన్నతుడు, ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు. ఇంకా చూడండి, అల్ - అ'అలా, 87:1.

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now