కురాన్ - 2:180 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

كُتِبَ عَلَيۡكُمۡ إِذَا حَضَرَ أَحَدَكُمُ ٱلۡمَوۡتُ إِن تَرَكَ خَيۡرًا ٱلۡوَصِيَّةُ لِلۡوَٰلِدَيۡنِ وَٱلۡأَقۡرَبِينَ بِٱلۡمَعۡرُوفِۖ حَقًّا عَلَى ٱلۡمُتَّقِينَ

మీలో ఎవరికైనా మరణకాలం సమీపించినప్పుడు అతడు ఆస్తిపాస్తులు గలవాడైతే అతడు తన తల్లిదండ్రుల కొరకు మరియు సమీపబంధువుల కొరకు ధర్మసమ్మతమైన మరణశాసనం (వీలునామా) వ్రాయాలి.[1] ఇది దైవభితి గలవారి విద్యుక్త ధర్మం.

సూరా సూరా బకరా ఆయత 180 తఫ్సీర్


[1] ఆస్తుల పంపక విషయానికై చూడండి, 4:11-12, ఈ ఆయత్ వాటి కంటే ముందు అవతరించబడింది. వీలునామా కేవలం 1/3 భాగపు ఆస్తి కొరకు మాత్రమే చేయవచ్చు. 2/3 భాగపు ఆస్తి మృతుని ప్రథమ శ్రేణి బంధువుల (వారసుల) హక్కు. ఆస్తికి హక్కుదారులైన ప్రథమ శ్రేణి బంధువులు (వారసులు) వీలునామాకు హక్కుదారులు కారు. ఈ 1/3 భాగం ఆస్తిపరుడు తన వీలునామాలో ఆస్తికి హక్కుదారులు కానటువంటి దూరబంధువులకు, స్నేహితులకు లేక ధర్మ కార్యాలకు ఇవ్వవచ్చు. 1/3 భాగం కంటే ఎక్కువ భాగానికి వీలునామా వ్రాయటం ధర్మ సమ్మతం కాదు. ('స. బు'ఖారీ, కితాబుల్ ఫరాయ'ద్, బాబ్ మీరాస్' అల్-బనాత్). ఆస్తి తక్కువ ఉంటే - కేవలం పేరు ప్రతిష్ఠల కొరకు - హక్కుదారులను పేదరీకంలో వదలి, ధర్మకార్యాలకు లేక హక్కులేని వారి కొరకు - 1/3 భాగానికి కూడా - వీలునామా వ్రాయటం సమ్మతించదగినది కాదు. ఒక విశ్వాసి - ఒక విశ్వాసి, ఉభయులూ ఒకరికొకరు వారసులు కాలేరు. కాని వీలునామా (వ'సియ్యత్) ద్వారా వారికి ధన సహాయం చేయవచ్చు.

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now