కురాన్ - 2:198 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

لَيۡسَ عَلَيۡكُمۡ جُنَاحٌ أَن تَبۡتَغُواْ فَضۡلٗا مِّن رَّبِّكُمۡۚ فَإِذَآ أَفَضۡتُم مِّنۡ عَرَفَٰتٖ فَٱذۡكُرُواْ ٱللَّهَ عِندَ ٱلۡمَشۡعَرِ ٱلۡحَرَامِۖ وَٱذۡكُرُوهُ كَمَا هَدَىٰكُمۡ وَإِن كُنتُم مِّن قَبۡلِهِۦ لَمِنَ ٱلضَّآلِّينَ

(హజ్జ్ యాత్రలో) మీరు మీ ప్రభువు అనుగ్రహాలు అన్వేషిస్తే[1] అందులో దోషం లేదు. అరఫాత్[2] నుండి బయలు దేరిన తరువాత మష్అరిల్ హరామ్ (ముజ్'దలిఫా)[3] వద్ద (ఆగి) అల్లాహ్ ను స్మరించండి. మరియు ఆయన మీకు బోధించిన విధంగా ఆయనను స్మరించండి, వాస్తవానికి మీరు పూర్వం మార్గభ్రష్టులుగా ఉండేవారు.

సూరా సూరా బకరా ఆయత 198 తఫ్సీర్


[1] అనుగ్రహాలు అంటే 'హిజ్ యాత్రలో వ్యాపారం మొదలైనవి చేయటం ధర్మసమ్మతమే. [2] 'అరఫాత్: మక్కా నుండి దాదాపు 12 కి.మీ. దూరంలో 'హరమ్ సరిహద్దులకు బయటనున్న ఒక మైదానం. అందులో ఒక చిన్న కొండ ఉంది దాని పేరు జబలె - ర'హ్మ. దైవప్రవక్త ('స'అస) 'హజ్ చేసినప్పుడు దాని దగ్గర నుంచొని 'హజ్ ఉపన్యాసం (ఖు'త్బా) ఇచ్చారు. 'హజ్ చేయాలని సంకల్పించిన వారు జు'ల్-'హిజ్జహ్ 9వ తేదీన మధ్యాహ్నం నుండి 10వ తేదీ ఫజ్ర్ అ'జాన్ సమయం వరకు 'హజ్ నియ్యత్ తో ఇ'హ్రాం ధరించి కొంత సమయం ఈ మైదానంలో గడపడం మరియు అల్లాహ్ (సు.తా.) ను ప్రార్థించడం విధి. 'హదీస్' ప్రకారం 'అరఫాత్ లో ఆగడమే 'హజ్. 'అరఫాత్ మైదానం 'హరం సరిహద్దుల బయట ఉంది. [3] మస్జిద్ మష్అరిల్ - 'హరామ్ ము'జ్దలిఫాలో ఉంది. జు'ల్ - 'హిజ్జహ్ 9వ తేదీన 'హాజీలు 'అరఫాత్ మైదానంలో కొంతకాలం గడిపిన తరువాత ఇక్కడకు చేరుకొని, మ'గ్రిబ్ మరియు 'ఇషా నమాజ్' లు కలిపి చేయడం మస్నూన్. వారు రాత్రి ఇక్కడ గడిపి, 10వ తేదీ ఫజ్ర్ నమా'జ్ తరువాత మీనాకు చేరుకుంటారు. ఇక్కడి నుండి జమరాత్ లపై విసరటానికి, చిన్న చిన్న కంకర రాళ్ళు ఏరుకుంటారు. ము'జ్దలిఫా 'హరమ్ సరిహద్దులలోనే ఉంది.

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now