ఆయన (అల్లాహ్) యే మీ కొరకు భూమిని పరుపుగాను మరియు ఆకాశాన్ని కప్పుగాను చేశాడు. మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీకు జీవనోపాధిగా ఫలాలను (పంటలను) ఉత్పత్తి చేశాడు! కావున ఇది తెలుసుకొని కూడా, మీరు ఇతరులను అల్లాహ్ కు సాటిగా నిలబెట్టకండి.[1]
సూరా సూరా బకరా ఆయత 22 తఫ్సీర్
[1] మిమ్మల్ని మరియు సర్వసృష్టిని సృష్టించినవాడు అల్లాహ్ (సు.తా.) యే! మీకు జీవనోపాధిని సమకూర్చేవాడు కూడా ఆయనయే. అలాంటప్పుడు ఆయనను వదలి మీరు ఇతరులను ఎందుకు ఆరాధిస్తున్నారు? ఇతరులను ఆయనకు భాగస్వాములుగా ఎందుకు నిలబెడుతున్నారు? మీరు ఆయన శిక్ష నుండి తప్పించు కోవాలనుకుంటే! కేవలం ఆయననే ఆరాధించండి, ('స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం-6, 'హ. నం. 4)
సూరా సూరా బకరా ఆయత 22 తఫ్సీర్