మరియు నియమిత రోజులలో అల్లాహ్ ను స్మరించండి[1]. ఎవడైనా త్వరగా రెండు రోజులలోనే వెళ్ళిపోయినా, అతనిపై ఎలాంటి దోషం లేదు. మరెవడైనా నిదానించి (పదమూడవ తేదీ వరకు) నిలిచి పోయినా, అతనిపై ఎలాంటి దోషం లేదు[2], వాడికి, ఎవడైతే దైవభీతి కలిగి ఉంటాడో! మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు నిశ్చయంగా మీరంతా ఆయన సన్నిధిలో హాజరు చేయబడుతారనేది తెలుసుకోండి.
సూరా సూరా బకరా ఆయత 203 తఫ్సీర్
[1] తష్రీక్ దినాలలో అంటే జు'ల్-'హిజ్జహ్ 11, 12, 13 తేదీలలో ఫ'ర్ద్ నమా'జ్ ల తరువాత తక్బీర్ చదవాలి : "అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వ లిల్లాహిల్ హమ్ద్." కంకర రాళ్ళు విసురునపుడు ప్రతి కంకరరాయి విసిరిన తర్వాత ఈ తక్బీర్ చదవటం సున్నత్. (నీల్ అల్ అవ్ తార్ పుస్తకం - 5, పేజీ - 86. [2] మూడు జమరాతులపై 11 మరియు 12 జు'ల్ - 'హిజ్జహ్ తేదీలలో కంకర రాళ్ళను రువ్వాలి. 12వ తేదీన మ'గ్రిబ్ కు ముందు మీనా విడువ లేక పోతే, 13వ తేదీన కూడా "జుహ్ర్ నమా'జ్ తరువాత మూడు జమరాతులపై కంకరరాళ్ళను విసిరి మీనాను విడవాలి.
సూరా సూరా బకరా ఆయత 203 తఫ్సీర్