కురాన్ - 2:234 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَٱلَّذِينَ يُتَوَفَّوۡنَ مِنكُمۡ وَيَذَرُونَ أَزۡوَٰجٗا يَتَرَبَّصۡنَ بِأَنفُسِهِنَّ أَرۡبَعَةَ أَشۡهُرٖ وَعَشۡرٗاۖ فَإِذَا بَلَغۡنَ أَجَلَهُنَّ فَلَا جُنَاحَ عَلَيۡكُمۡ فِيمَا فَعَلۡنَ فِيٓ أَنفُسِهِنَّ بِٱلۡمَعۡرُوفِۗ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ خَبِيرٞ

మరియు మీలో ఎవరైనా మరణించి, భార్యలను వదలిపోయినట్లైతే (అలాంటి విధవలు) నాలుగు నెలల పది రోజులు (రెండవ పెండ్లి చేసుకోకుండా) వేచి ఉండాలి[1]. వారి గడువు పూర్తి అయిన తరువాత వారు తమకు ఉచితమైనది, ధర్మసమ్మతంగా చేసుకుంటే మీపై దోషం లేదు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును.

సూరా సూరా బకరా ఆయత 234 తఫ్సీర్


[1] ఈ 'ఇద్దత్ గడువు ప్రతి స్తీకి వర్తిస్తుంది. సంభోగం కాని స్త్రీ అయినా లేక ముసలిది అయినా సరే! కాని గర్భవతి అయిన స్త్రీ మాత్రం కాన్పు వరకు వేచి ఉండాలి, (65:4). ఈ గడువు కాలంలో వారు తమ మృత భర్త ఇంటిలోనే ఉండాలి. (ఇబ్నె - కసీ'ర్).

Sign up for Newsletter