ఏమీ? మృత్యుభయంతో, వేల సంఖ్యలో ప్రజలు తమ ఇండ్లను వదలి పోయింది నీకు తెలియదా? అప్పుడు అల్లాహ్ వారితో: "మరణించండి!" అని అన్నాడు కాని తరువాత వారిని బ్రతికించాడు. [1] నిశ్చయంగా, అల్లాహ్ మానవుల పట్ల అత్యంత అనుగ్రహం గలవాడు, కాని చాలా మంది కృతజ్ఞతలు చూపరు.
సూరా సూరా బకరా ఆయత 243 తఫ్సీర్
[1] ఇది ఒక ప్రాచీన సమాజపు కథ, దీనిని గురించి ఏ 'హదీస్' లేదు. కొందరు దీనిని ఇస్రాయీ'ల్ సంతతి వారిలోని ఒక ప్రవక్త కాలపు కథ, కావచ్చని అంటారు. బహుశా, హిజ్కీల్ ('అ.స.) కాలపు విషయమై ఉండవచ్చు.
సూరా సూరా బకరా ఆయత 243 తఫ్సీర్