కురాన్ - 2:164 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِنَّ فِي خَلۡقِ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَٱخۡتِلَٰفِ ٱلَّيۡلِ وَٱلنَّهَارِ وَٱلۡفُلۡكِ ٱلَّتِي تَجۡرِي فِي ٱلۡبَحۡرِ بِمَا يَنفَعُ ٱلنَّاسَ وَمَآ أَنزَلَ ٱللَّهُ مِنَ ٱلسَّمَآءِ مِن مَّآءٖ فَأَحۡيَا بِهِ ٱلۡأَرۡضَ بَعۡدَ مَوۡتِهَا وَبَثَّ فِيهَا مِن كُلِّ دَآبَّةٖ وَتَصۡرِيفِ ٱلرِّيَٰحِ وَٱلسَّحَابِ ٱلۡمُسَخَّرِ بَيۡنَ ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يَعۡقِلُونَ

నిశ్చయంగా, భూమ్యాకాశాల సృష్టిలోనూ, రేయింబవళ్ళ మార్పులోనూ, ప్రజలకు ఉపయోగకరమైన వాటిని తీసుకొని, సముద్రంలో పయనించే ఓడలలోనూ మరియు అల్లాహ్ ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి దాని ద్వారా నిర్జీవమైన భూమికి ప్రాణం పోసి, అందులో వివిధ రకాల జీవరాసులను వర్ధిల్లజేయటంలోనూ; మరియు వాయువులు మరియు మేఘాలు, భూమ్యాకాశాల మధ్య నియమబద్ధంగా చేసే సంచారాల మార్పులలోనూ బుద్ధిమంతులకు ఎన్నో సంకేతాలనున్నాయి.[1]

సూరా సూరా బకరా ఆయత 164 తఫ్సీర్


[1] ఈ ఆయతులో అల్లాహ్ (సు.తా.) సృష్టించి, నడిపిస్తున్న ప్రకృతి నియమాలను గురించి వివరించడమైనది. 1) భూమ్యాకాశాల సృష్టి, 2) రాత్రింబవళ్ళు ఒకదాని తరువాత ఒకటి రావటం మరియు వాటి కాలాలలో హెచ్చు తగ్గులు, 3) సముద్రాలలో నావలు ఎంతో భారాన్ని తీసుకొని పయనించటం, 4) వర్షం కురిసి జీవం లేని భూమికి జీవమివ్వటం, 5) వివిధ రకాల జీవరాసుల సృష్టి, 6) చల్లని, వెచ్చని వివిధ దిక్కుల నుండి వీచే గాలి, 7) అల్లాహుతా'ఆలా తాను కోరిన చోట వర్షం కురిపించటానికి, తనకు నియమబద్ధులుగా సృష్టించిన మేఘాలు; వీటన్నింటిలో బుద్ధిమంతులకు ఎన్నో సూచనలున్నాయి. ఈ కార్యాలలో ఆయనకు మరెవ్వరూ భాగస్వాములు లేరనేది కూడా వ్యక్తమౌతోంది. ఎందుకంటే ఎవరైనా ఆయనకు భాగస్వాములుంటే ఈ సృష్టిలో అల్లకల్లోలం చెలరేగి ఉండేది.

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now