కురాన్ - 2:226 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

لِّلَّذِينَ يُؤۡلُونَ مِن نِّسَآئِهِمۡ تَرَبُّصُ أَرۡبَعَةِ أَشۡهُرٖۖ فَإِن فَآءُو فَإِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٞ

ఎవరైతే తమ భార్యలతో (సంభోగించము, అని) ప్రమాణం చేస్తారో, వారికి నాలుగు నెలల వ్యవధి ఉంది[1]. కాని వారు తమ దాంపత్య జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తే! నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

సూరా సూరా బకరా ఆయత 226 తఫ్సీర్


[1] ఈలా: అంటే శపథం. ఏ వ్యక్తి అయినా తన భార్యతో ఇన్ని నెలలు కలువనని శపథం చేసి ఆ గడువు పూర్తి కాక ముందే ఆమెతో కలిస్తే కఫ్ఫారా చేయాలి. ఒకవేళ ఆ గడువు 4 నెలల కంటే ఎక్కువ ఉంటే - అతడు ఆమెను 4 నెలల కంటే ఎక్కువ కాలం వ్రేలాడ నివ్వలేడు కావున - నాలుగు నెలల తరువాత ఆమెతో ఆదరంగా దాంపత్య జీవితం సాగించాలి. లేదా ఆదరంగా సాగనంపాలి. (ఇబ్నె - కసీ'ర్).

Sign up for Newsletter