కురాన్ - 2:158 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

۞إِنَّ ٱلصَّفَا وَٱلۡمَرۡوَةَ مِن شَعَآئِرِ ٱللَّهِۖ فَمَنۡ حَجَّ ٱلۡبَيۡتَ أَوِ ٱعۡتَمَرَ فَلَا جُنَاحَ عَلَيۡهِ أَن يَطَّوَّفَ بِهِمَاۚ وَمَن تَطَوَّعَ خَيۡرٗا فَإِنَّ ٱللَّهَ شَاكِرٌ عَلِيمٌ

నిశ్చయంగా, 'సఫా మరియు మర్వాలు అల్లాహ్ చూపిన చిహ్నాలు[1]. కావున ఎవడు (కఅబహ్) గృహానికి 'హజ్జ్ లేక 'ఉమ్రా కొరకు పోతాడో[2], అతడు ఈ రెంటి మధ్య పచార్లు (స'యీ) చేస్తే, అతనికి ఎట్టి దోషం లేదు. మరియు ఎవడైనా స్వేచ్ఛాపూర్వకంగా మంచికార్యం చేస్తే! నిశ్చయంగా, అల్లాహ్ కృతజ్ఞతలను ఆమోదించేవాడు[3], సర్వజ్ఞుడు.

సూరా సూరా బకరా ఆయత 158 తఫ్సీర్


[1] 'సఫా-మర్వాలు మక్కాలో క'అబహ్ కు కొంత దూరంలో ఉన్న చిన్న గుట్టలు. 'హజ్ లేక 'ఉమ్రా చేసేవారు క'అబహ్ చుట్టు ఏడు ప్రదక్షిణలు ('తవాఫ్) చేసిన తరువాత 'సఫా-మర్వా గుట్టల మధ్య ఏడు సార్లు పచార్లు (స'యీ) చేయాలి. ఇది తప్పకుండా చేయాలి (వాజిబ్). ఇబ్రాహీమ్ ('అ.స.) భార్య - ఇస్మా'యీల్ ('అ.స.) యొక్క తల్లి - అయిన సయ్యిదా హాజర్, ఇస్మా'యీల్ ('అ.స.)ను కాబా దగ్గర పరుండబెట్టి, నీటి కొరకు ఈ రెండు గుట్టల మధ్య పరుగెత్తుతూ, తన కుమారుణ్ణి ఈ గుట్టలెక్కి చూసేది. అదే కార్యాన్ని అల్లాహ్ (సు.తా.) ముస్లింలకు 'హజ్ లేక 'ఉమ్రా చేసేటప్పుడు, ఆచరించమని ఆజ్ఞాపించాడు.ఇవే కాకుండా 'హజ్ చేసే వారి కొరకు ఇతర ఆచారాలు అంటే బలి (ఖుర్బానీ) ఇవ్వటం, మీనాలోని మూడు జమరాతుల మీద ప్రతిదానిపై ఏడేసి గులక రాళ్ళు రువ్వటం, మొదలైనవి ఉన్నాయి. సయ్యిదా హాజర్ యొక్క ప్రార్థనను అంగీకరించి అల్లాహ్ (సు.తా.) ఇస్మా'యీల్ (అ.స.) కాళ్ళ దగ్గర 'జమ్ 'జమ్ నీటి బుగ్గను పుట్టించాడు. అందులో ఈనాటి వరకు నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి. బైతుల్లాహ్ ను సందర్శించే వారు ఈ నీటిని త్రాగి, అల్లాహుతా'ఆలాకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇంకా అక్కడ తమ కోరికల పూర్తికై, పాపవిమోచనకై, ఉత్తమ ప్రతిఫలాలకై అల్లాహ్ (సు.తా.)ను ప్రార్థిస్తారు. [2] 'హజ్ అంటే జుల్-'హజ్ నెలలో 8-13 తేదీల వరకు క'అబహ్, మీనా, 'అరఫాత్ మరియు ము'జ్దలిఫాలను సందర్శించటం. 'ఉమ్రా అంటే ఈ తేదీలలో కాక ఇతర కాలంలో ఎప్పుడైనా క;అబహ్ ను దర్శించటం. చూడండి' 14:37). 'ఉమ్రా చేయదలుచుకున్నవారు: 'హరమ్ సరిహద్దుల బయటి నుండి (మీఖాత్ బయట ఉండేవారు మీఖాత్ నుండి) 'ఉమ్రా దీక్ష (నియ్యత్)తో, ఇ'హ్రామ్ ధరించి, క'అబహ్ చుట్టు ఏడు ప్రదక్షిణలు చేసి, తరువాత 'సఫా-మర్వాల మధ్య ఏడు సార్లు పచార్లు చేసి, ఆ తరువాత శరోముండనం చేయించుకొని, ఇ'హ్రామ్ విడుస్తారు. మీఖాత్ మరియు 'హరమ్ సరిహద్దులను మహా ప్రవక్త ('స'అస) సూచించారు. [3] షాకిరున్ (అష్-షకూరు): One who approves or Rewards or Forgives much or largely. అంటే కృతజ్ఞతలను ఆమోదించే, అంగీకరించే, ఆదరించే, విలువనిచ్చే వాడు. తన దాసుల మంచి కార్యాలకు అమితంగా ప్రతిఫలమిచ్చేవాడు. All-Appreciative, యోగ్యతను గుర్తించే, పరిగణించే వాడు. అష్-షుకూర్ కు చూడండి, 4:147. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.

Sign up for Newsletter