కురాన్ - 2:190 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَقَٰتِلُواْ فِي سَبِيلِ ٱللَّهِ ٱلَّذِينَ يُقَٰتِلُونَكُمۡ وَلَا تَعۡتَدُوٓاْۚ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ ٱلۡمُعۡتَدِينَ

మరియు మీతో, పోరాడే వారితో, మీరు అల్లాహ్ మార్గంలో పోరాడండి. కాని హద్దులను అతిక్రమించకండి. నిశ్చయంగా, అల్లాహ్ హద్దులను అతిక్రమించేవారిని ప్రేమించడు[1].

సూరా సూరా బకరా ఆయత 190 తఫ్సీర్


[1] ఈ ఆయత్ లో జిహాద్: ధర్మపోరాటం, అంటే ఎవరైతే మీతో పోరాడుతారో, అలాంటి వారితో మీరు పోరాడండని అనుమతి ఇవ్వబడింది. చూడండి 22:39. ఆ ఆయత్ జిహాద్ ను గురించి మొదటి సారిగా అవతరింపబడిందని చాలా మంది 'హదీస్' వేత్తలు వ్రాశారు, ('తబరీ, ఇబ్నె-కసీ'ర్). హద్దులను అతిక్రమించకూడదు అంటే, స్త్రీల, పిల్లల, వృద్ధుల హత్య చేయకూడదు. ఎవరైతే మీతో పోరాడుతారో, వారినే వధించాలి. ఇదే విధంగాపంట పొలాలను, చెట్లుచేమలను, పశువులను, అనవసరంగా పాడు చేయరాదు. జిహాద్ గురించి 4:91, 60:8 మరియు 'స. బు'ఖారీ, పుస్తకం - 4, 'హదీస్' నం. 4 చూడండి.

Sign up for Newsletter